TG: అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక టాస్క్

by Gantepaka Srikanth |

నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

TG: అధికారులకు డిప్యూటీ CM భట్టి కీలక టాస్క్
X

దిశ, వెబ్‌డెస్క్: నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రిసోర్స్ మొబలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యుడు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రతివారం జరుగుతుందని, తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. తాజా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రగతిని వచ్చేవారం సమావేశంలో అంశాల వారీగా సమీక్షిస్తామని తెలిపారు.

తాజా సమావేశంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్‌కు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నిర్మించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో శాఖల వారీగా అంశాలను డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజు, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, సీసీఎల్ ఏ సెక్రటరీ నవీన్ మిట్టల్, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, కమిషనర్లు హరిత, హరికిరణ్, విష్ణువర్ధన్, సురేంద్రమోహన్, బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఇలంబర్తి, ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story