- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్‌కు డిప్యూటీ CM భట్టి గుడ్ న్యూస్
తెలంగాణ సంస్కృతి, ఉద్యమ చైతన్యానికి ప్రతీక అయిన ప్రజాకళాకారుడు గద్దర్(Gaddar) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు - 2024(Telangana Gaddar Cine Awards) అందించడం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతి, ఉద్యమ చైతన్యానికి ప్రతీక అయిన ప్రజాకళాకారుడు గద్దర్(Gaddar) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు - 2024(Telangana Gaddar Cine Awards) అందించడం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అన్నారు. ఈ మేరకు సినీ అవార్డుల ప్రదానోత్సవంపై నెట్టింట పోస్టు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక హక్కుల కోసం గళం విప్పి, గజ్జలు మోగించి, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన గద్దర్ జీవిత మార్గదర్శనమే ఈ అవార్డుల ప్రేరణ అన్నారు. 2011లో ఆగిపోయిన రాష్ట్ర సినీ అవార్డుల పునఃప్రారంభానికి ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ సినిమాలు, దర్శకులు, నటీనటులకు పురస్కారాలు అందిస్తుండగా, 2024కు చెందిన అన్ని కేటగిరీల కింద అవార్డులు ప్రకటించామని తెలిపారు.
తెలుగు సినీ రంగానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య పేర్లతో కూడా ప్రత్యేక పురస్కారాలు ఇవ్వడం గర్వకారణమని తెలిపారు. తమ ప్రభుత్వం తెలంగాణను సినిమా రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా ముందుకెళ్తోందని అన్నారు. సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో, టూరిజం లొకేషన్లలో షూటింగ్‌కు అవసరమైన సహాయం, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కార్మిక సంక్షేమం వంటి అంశాల్లో గట్టి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా శుభవార్త చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించామని అన్నారు. తెలంగాణ గర్వించదగిన కళాకారుడు గద్దర్ పేరుతో ఈ పురస్కారాలను అందించడమన్నది సినిమా పరిశ్రమకు ఇచ్చే గౌరవానికి నిదర్శనం. తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా ప్రత్యేక శుభాకాంక్షలు. అభివృద్ధిలో తెలంగాణ ముందుండేలా అందరం కలిసి కృషి చేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ సంస్కృతి, ఉద్యమ చైతన్యానికి ప్రతీక అయిన ప్రజాకళాకారుడు గద్దర్ గారి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంగా అందిస్తున్న తెలంగాణ గద్దర్ సినీ అవార్డులు - 2024 అందించడం గర్వకారణం.
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) June 15, 2025
తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక హక్కుల కోసం గళం విప్పి, గజ్జలు మ్రోగించి, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం… pic.twitter.com/Vx7xbvaxdA






