DCM: ‘ఉచిత విద్యుత్’ పథకం వైఎస్ఆర్ పేటెంట్.. డిప్యూటీ సీఎం భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

“ఉచిత విద్యుత్” పథకం వైఎస్ పేటెంట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

DCM: ‘ఉచిత విద్యుత్’ పథకం వైఎస్ఆర్ పేటెంట్.. డిప్యూటీ సీఎం భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: “ఉచిత విద్యుత్” (Free electricity scheme) పథకం వైఎస్ఆర్ పేటెంట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వర్ధంతి సందర్భంగా వైఎస్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ స్మారక అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డును అందుకున్న డాక్టర్ సుభాష్ పాలేకర్, డాక్టర్ సి.సుధా, డాక్టర్ నాగేశ్వరరావు లకు భట్టి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆలోచనలు, కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజా ప్రభుత్వం పూర్తిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా భట్టి వెల్లడించారు. వైఎస్ఆర్ చేపట్టిన ప్రతి సామాజిక సంక్షేమ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ఉచిత విద్యుత్ పథకం వైఎస్ పేటెంట్, దేశంలో ఆ ఐడియాను ప్రజలకు అందించిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. రైతు సంక్షేమ కార్యక్రమాలు మూడు నెలల్లోనే 21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి, 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా కింద అన్నదాతలకు జమ చేశామని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధరతో పాటు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అందిస్తున్నామని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు వడ్డీలేని రుణాలు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తూ వారి భావాలు ఆలోచనలను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.

Next Story