DCM: డెక్కన్ పీఠభూమి పర్యాటకులకు నిజమైన స్వర్గసీమ: డిప్యూటీ సీఎం భట్టి

by Ramesh Naini |

ఓ వైపు కృష్ణ, మరో వైపు గోదావరి జీవనదుల మధ్య విస్తరించిన డెక్కన్ పీఠభూమి పర్యాటకులకు నిజమైన స్వర్గసీమ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

DCM: డెక్కన్ పీఠభూమి పర్యాటకులకు నిజమైన స్వర్గసీమ: డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ శిల్పారామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్‌లో (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఓ వైపు కృష్ణ, మరో వైపు గోదావరి జీవనదుల మధ్య విస్తరించిన డెక్కన్ పీఠభూమి పర్యాటకులకు నిజమైన స్వర్గసీమ అని పేర్కొన్నారు. గలగల పారే నదులు, పచ్చని అరణ్యాలు, ప్రకృతి అందాలు, చారిత్రక వారసత్వం, ఆధునిక హైదరాబాదుతో పాటు, తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని తెలిపారు. గత పదేళ్ల పాటు రాష్ట్ర పర్యాటక శక్తిని ప్రపంచ పటంలో నిలబెట్టడంలో నిర్లక్ష్యం జరిగిందని, కానీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం “Telangana Rising” నినాదంతో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు.

పర్యాటక రంగంలో ఇప్పటికే రూ.50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించబడుతున్నాయి అని పేర్కొంటూ, వెల్‌నెస్ సెంటర్లు, హాస్పిటల్ టూరిజం, ఎకో టూరిజం, సినీ పరిశ్రమ, సాఫ్ట్‌వేర్ రంగం, సాంస్కృతిక సంపద అన్ని కలిసి తెలంగాణను ప్రపంచ పర్యాటకుల గమ్యస్థానంగా నిలబెడతాయని వివరించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న వేళ, అభినందించాల్సిన వారు కొందరు ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు. వాతావరణం, భాష, శాంతి భద్రతలు, మానవ వనరుల వంటి అనేక అంశాల్లో తెలంగాణ ప్రత్యేకతను ప్రదర్శిస్తోందని తెలిపారు. పెట్టుబడిదారుల సంక్షేమం, రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రత రెండింటినీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story