- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. ఫోర్‌లైన్ రోడ్లు రాబోతున్నాయ్! డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ప్రజలకు, వాహనాదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రజలకు, వాహనాదారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గుడ్‌న్యూస్ చెప్పారు. (Traffic problems) ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు భవిష్యత్తులో (Four-lane roads) ఫోర్‌లైన్ రోడ్లకు ప్రణాళికలు జరుగుతున్నాయని భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ హైటెక్స్ న్యాక్ లో ఆర్&బీ, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యామ్ రోడ్లకు సంబంధించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రహదారులు నాగరికతకు ప్రతీకలు, పరిశ్రమల అభివృద్ధికి బాటలు, ఉపాధి అవకాశాల సృష్టికి పునాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం రహదారుల అభివృద్ధి విషయంలో అచంచలమైన కట్టుబాటుతో ముందుకు సాగుతోందన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 17 ప్యాకేజీల్లో 7,947 కిలోమీటర్ల రోడ్లు, రోడ్లు అండ్ భవనాల శాఖ ద్వారా 17 ప్యాకేజీలలో 5,190 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఒప్పందాలు చేసుకుని, రూ. 45 వేల కోట్ల విలువైన పనులకు టోకెన్లు జారీ చేసి, వాటి బకాయిల భారాన్ని రాష్ట్ర ప్రజల భుజాలపై వేసి వెళ్లిందన్నారు. హ్యామ్ రోడ్లకు ప్రభుత్వ వాటా 40 శాతం నిధుల సమీకరణ క్రమంలో కాంట్రాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ‘తెలంగాణ రైజింగ్’ లో భాగస్వాములు కావాలని కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.






