హైదరాబాద్ ఓ గేమ్ ఛేంజర్.. గ్రీన్ పవర్ అందించే ఆలోచన.. డిప్యూటీ సీఎం భట్టి హాట్ కామెంట్స్

by Ramesh Naini |

తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

హైదరాబాద్ ఓ గేమ్ ఛేంజర్.. గ్రీన్ పవర్ అందించే ఆలోచన.. డిప్యూటీ సీఎం భట్టి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ ఒక గేమ్ ఛేంజర్ (Game changer) అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఎఫ్‌టీసీసీఐ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. (Musi River) మూసీ నది పునరుద్ధరణ, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి అంచనాలకు మించి జరుగుతుందని హాట్ కామెంట్స్ చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్య ఐటీ, ఫార్మా, హౌసింగ్ వంటి అనేక క్లస్టర్‌లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందని, త్వరలో గ్రీన్ పవర్ అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో అనుకూలమైన వాతావరణం, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు పెట్టుబడులకు అత్యంత అనుకూలమని ఆయన వివరించారు. స్కిల్ యూనివర్సిటీలు, అంబేద్కర్ నాలెడ్జి సెంటర్లు, కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే పథకాలు అమలవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడం, ఇక్కడ సృష్టించిన సంపదను రాష్ట్రం అంతటా విస్తరించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

Next Story