- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deputy CM Bhatti: గాఢాంధకారం నుంచి బయటకు తీసుకొచ్చే కార్యక్రమం ఇది
గాఢాంధకారం నుంచి బయటకు తీసుకొచ్చే కార్యక్రమం ఇది

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇది అద్భుతమైన కార్యక్రమం. అజ్ఞానం అనే గాఢాంధకారం నుంచి బయటకు తీసుకొచ్చే దీపాలు వెలిగించే కార్యక్రమం అనేక శతాబ్దాలుగా మన సంస్కృతిలో ఉంది. సమాజాన్ని, తమను తమ కుటుంబాన్ని చల్లగా చూడమని కోరుకునే కార్యక్రమం ఇది. కోటి దీపోత్సవాన్ని అద్భుతమైన కార్యక్రమంగా ప్రభుత్వం భావిస్తుంది. దీనిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని సీఎం అన్నారు. జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి లేఖ రాస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాగా, కార్తీక మాసంలో జరిగే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా, అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని శనివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే జాతీయ గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఇదే వేదికపై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చెప్పడంతో రేవంత్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.






