- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Deputy CM Bhatti : డిప్యూటీ సీఎం భట్టి ప్రీ బడ్జెట్ సమావేశం
తెలంగాణ రాష్ట్రం(Telangana State Budget)2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన కసరత్తులో భాగంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) గురువారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రం(Telangana State Budget)2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన కసరత్తులో భాగంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) గురువారం డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆర్ ఆండ్ బీ శాఖ, ఆర్ధిక శాఖ అధికారులతో భట్టి ప్రీ బడ్జెట్(pre-budget meeting) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా శాఖలు అందించిన ప్రతిపాదనలపై చర్చించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ అన్ని శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను స్వీకరించింది. శాఖలు, పథకాల వారీగా రాబడులు, వ్యయాల అంచనాలను, ఉద్యోగుల జీతభత్యాల వివరాలను అన్ని శాఖలు పంపించాయి. ఈ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల ప్రతిపాదనలపై ఇప్పటికే చర్చించారు. ఒక్కో ప్రభుత్వ శాఖలతో భట్టి సమావేశమవుతూ బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ కసరత్తు చేస్తున్నారు.






