- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Deputy CM Bhatti : గద్దర్ అవార్డుల కమిటీతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ!
సినీ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సం సన్నాహాల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గద్దర్ అవార్డు(Gaddar Awards)ల కమిటీ(Committee) సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)డా. బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శనివారం భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : సినీ రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సం సన్నాహాల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గద్దర్ అవార్డు(Gaddar Awards)ల కమిటీ(Committee) సభ్యులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)డా. బీఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శనివారం భేటీ అయ్యారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి.. గద్దర్ అవార్డుల విధి విధానా(Procedures),లు, నియమ నిబంధనలు, లోగో(Logo)ను రూపొందించేందుకు సినీ ప్రముఖులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
గత ఆక్టోబర్ 14న కమిటీ సభ్యులతో భేటీయైన భట్టి తిరిగి ఈ రోజు మరోసారి వారితో సమావేశమయ్యారు. గద్దర్ అవార్డు లోగో, విధివిధానాలు, నియమ నిబంధనలపైన కమిటీ సభ్యులు చేసిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని పెద్ద పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కమిటీ సభ్యుల సూచనలను సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో గద్దర్ అవార్డుల కమిటీకి చైర్మన్ బి.నర్సింగరావు, వైస్ చైర్మన్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు, సభ్యులు జయసుధ, తమ్మారెడ్డి భరద్వాజ, గుమ్మడి వెన్నెల, అందెశ్రీ, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, హరీశ్ శంకర్, బలగం వేణు తదితరులు పాల్గొన్నారు.






