Deputy CM Bhatti: కేబినెట్ విస్తరణపై హైకమాండ్‌దే తుది నిర్ణయం.. భట్టి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-12 08:14:48  IST  )

రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ (Cabinet Expansion)పై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు.

Deputy CM Bhatti: కేబినెట్ విస్తరణపై హైకమాండ్‌దే తుది నిర్ణయం.. భట్టి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ (Cabinet Expansion)పై తుది నిర్ణయం హైకమాండ్‌దేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ ప్రజా పాలన (Praja Paalana)పై 50 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత సర్కార్‌పై వ్యతిరేకత ఉండటం సహజమని అన్నారు.

రాష్ట్రంలో చెరువులు, కుంటలు, ప్రభుత్వం స్థలాల పరిరక్షణకు ‘హైడ్రా’ (HYDRA) తీసుకొచ్చామని పేర్కొన్నారు. ‘హైడ్రా’ (HYDRA) అనేది స్వసంత్ర సంస్థ అని.. దానికి ధనిక, పేద అనే తారతమ్యాలు లేవని అన్నారు. చెరువులను ఎవరు ఆక్రమించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. రైతులకు ఇచ్చే బోనస్‌తో వారికి ఎక్కువ లబ్ధి కలుగుతోందని అన్నారు. తాము పాలనపై దృష్టి పెట్టాం కాబట్టే ప్రచారంలో వెనుకబడ్డామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల (Integrated Schools) నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఇక రైతు భరోసా (Rathi Bharosa)పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నామని ప్రకటించారు. గత సర్కార్ (BRS) చేసిన అప్పులకు ఇప్పటి వరకు రూ.64 వేల కోట్లు అసలు, వడ్డీలు కట్టామని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలన కంటే తాము ప్రజలకు మెరుగైన పాలన అందజేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రధాన ప్రతిపక్షానికి కౌంటర్ ఇచ్చారు.

Next Story