Medaram Jatara 2026 : వనదేవతలను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి దంపతులు

by Taduka Kalyani |   (  Updated:2026-01-29 11:21:39  IST  )

మేడారం మహా జాతరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు గురువారం దర్శించుకున్నారు

Medaram Jatara 2026 : వనదేవతలను దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి  దంపతులు
X

దిశ, మేడారం నెట్ వర్క్ : మేడారం మహా జాతరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శన ద్వారా స్వాగతం పలికి సమ్మక్క, సారలమ్మ లకు నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించి అనంతరం సమ్మక్క సారలమ్మ లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.


అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని తల్లులను వేడుకున్నామని, ప్రభుత్వం రూ.210 కోట్లతో చేపట్టిన చరిత్రాత్మక కట్టడాలు దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. గతం కంటే ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారని పేర్కొన్నారు. వనదేవతలు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా సుఖ సంతోషాలతో ఉంచాలని వేడుకున్నారు.




Next Story