Rythu Bharosa: గుడ్ న్యూస్.. నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ

by Prasad Jukanti |

నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.

Rythu Bharosa: గుడ్ న్యూస్.. నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: వానాకాలం సీజన్ కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా (Rythu Bharosa) నిధుల విడుదల కొనసాగుతోంది. ఇప్పటి వరకు 3 ఎకరాల భూమి ఉన్న రైతులకు బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయగా ఇవాళ 4 ఎకరాలకు వరకు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. దీనికోసం ప్రభుత్వం మరో రూ.1313.53 కోట్లు విడుదల చేసింది. దీంతో మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించిన 6.33 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారని తెలిపారు. 9 రోజుల్లో 9 వేల కోట్లను రైతుల ఖాతాలలో జమ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు మంత్రి వెల్లడించారు. మరో వారంలోగా పూర్తిగా రైతుభరోసా నిధుల జమ చేస్తామన్నారు.

రైతుభరోసా విషయంలో బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మంత్రి తుమ్మల దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా వానాకాలం రైతుబంధు సహాయం ఎప్పుడు సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని ప్రతిసారి ఆలస్యంగానే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి జమ చేశారని విమర్శించారు. అదికూడా 10వ నెల వరకు కొనసాగేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా మా ప్రభుత్వంలో మాత్రం రైతులకు ఏ పథకాలను ఆపడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకొని మా ప్రభుత్వంపై విమర్శలు మానుకోవాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ ను తెలంగాణ రైతాంగం ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితులలోనైనా తెలంగాణ రైతాంగం కోసం మా ప్రభుత్వం నిలబడుతుందని, వారి సంక్షేమమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రైతుల సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

Next Story