- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన అడబిడ్డలపై పైశాచికత్వం.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం: ఎమ్మెల్సీ కవిత హాట్ ట్వీట్
పోడు భూమిని సాగుచేసుకుంటున్న మహిళా రైతులపై అటవీ అధికారులు, సిబ్బంది దాడికి పాల్పడ్డారనే వార్తలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పోడు భూమిని సాగుచేసుకుంటున్న మహిళా రైతులపై అటవీ అధికారులు, సిబ్బంది దాడికి పాల్పడ్డారనే వార్తలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్నాయి. కొత్తగూడెం (Kothagudem) జిల్లా బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరువైండి బీట్ కోసుగుంపు గ్రామంలో పోడు సాగుదారులకు చెందిన భూముల్లో అటవీ అధికారులు జేసీబీలతో కందకాలు తీయించేందుకు వెళ్లారు. దీంతో వారిని అక్కడున్న గిరిజన మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జరిగిన తొపులాటలో అటవీ శాఖ అధికారులు తమను దారుణంగా కొట్టారని, తమ దుస్తులు కూడా చించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే కొసుగుంపు గిరిజన మహిళలపై జరిగిన దాడిపై తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. గిరిజన అడబిడ్డలపై పైశాచికత్వం.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటూ మండిపడ్డారు. 30 ఏళ్లుగా తమ జీవనాధారమైన పోడు భూములను సర్కారు వెనక్కి తీసుకోవడానికి ఇంతటి దుర్మార్గానికి తెగపడటం దారుణమని అన్నారు. లగచర్లలో లంబాడీ అడబిడ్డలపై పోలీసుల అఘాయిత్యాన్ని మరువక ముందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవైండి గ్రామ పరిధిలో గిరిజన మహిళల దుస్తులు చించేసి ఫారెస్ట్ అధికారులు దాడులకు తెగబడటం అత్యంత అమానవీయం అని ఆక్షేపించారు. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.






