- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : ధర్మపురిలో రాక్షస పాలన నడుస్తోంది : మాజీ మంత్రి కొప్పుల
అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతు గుండాల్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwer) ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతు గుండాల్లా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwer) ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపైన దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ధర్మపురి(Dharmapuri) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరంన్నారా గడిచిన ఎమ్మెల్యే గెలిచిన లక్ష్మణ్ కుమార్(MLA Laxman Kumar) తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. ఎన్నికల కోసం అధికారం కోసం అలివి కానీ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేయడం ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత అభివృద్ధి చేశారో చెప్పండని ప్రశ్నించారు.
మీ ముఖ్యమంత్రి మా దగ్గర ఏం లేవు కోసినా కూడా ఒక్క పైసా లేదు, ఎవడు కూడా నమ్మి అప్పు ఇవ్వడం లేదని మాట్లాడుతున్నాడని.. మరి మీరు ఎక్కడి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో చూపాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులను ఎవరు క్షమించరని, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే ఇలాంటి దౌర్జన్యం జరగలేదుని, పోలీసులను ఉపయోగించి కక్ష సాధింపు చర్యలు చేయలేదన్నారు. పరిపాలించే పద్ధతి కాదని, ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంత అభివృద్ధి చేస్తారో చేసి చూపించండి, కానీ భౌతిక దాడుల గీతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని హెచ్చరించారు.






