- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Uttam : కాంగ్రెస్ బలోపేతంతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ : మంత్రి ఉత్తమ్
దేశంలో కాంగ్రెస్ బలోపేతం(Strengthening Congress)తోనే ప్రజాస్వామ్య..రాజ్యాంగ పరిరక్షణ(Democracy And Constitution Protecte) సాధ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కాంగ్రెస్ బలోపేతం(Strengthening Congress)తోనే ప్రజాస్వామ్య..రాజ్యాంగ పరిరక్షణ(Democracy And Constitution Protecte) సాధ్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ప్రధాని మోడీ పాలనలో దేశంతో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ జై బాపు.జై భీమ్..జై సంవిధాన్ నినాదంతో ముందుకు రావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు.
దేశంలో మతపరమైన విభజన సృష్టించి బీజేపీ రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలకు గొంతు వినిపించే అవకాశం ఉండదని, ప్రెస్ ఫ్రీడమ్ తగ్గిపోయిందని..న్యాయ వ్యవస్థపై కామెంట్ చేయలేని పరిస్థితి అని..అన్ని రకాలుగా స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్న ఈ సమయంలో కాంగ్రెస్ బలంగా ముందుకు సాగడం ఖచ్చితంగా అవసరమన్నారు. అది ప్రజలకు, భావితరాలకు కూడా అవసరమని తాను స్పష్టం చేస్తున్నానని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సామాజిక న్యాయం కోసం రాష్ట్ర కాంగ్రెస్ సాహసోపేతంగా కులగణన, ఎస్సీ వర్గీకరణపై కసరత్తు పూర్తి చేసిందని..అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులను పెట్టబోతుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయబోతున్నామన్నారు.






