- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీహెచ్ఎంసీలో డిలిమిటేషన్ షురూ
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతోపాటు హైదరాబాద్ మరింత మహానగరంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతోపాటు హైదరాబాద్ మరింత మహానగరంగా మారింది. విలీనంతో జీహెచ్ఎంసీ 30 సర్కిళ్లతోపాటు మరో 27సర్కిళ్లుగా గుర్తించారు. మొత్తం సర్కిళ్ల సంఖ్య 57కి చేరింది. ఈ మహా నగరాన్ని విస్తరించడంతోపాటు విభజించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే వార్డుల పునర్విభజనకు సంబంధించిన పనులను జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రారంభించారు. గత వారం రోజులుగా ప్రాథమిక సమాచారాన్ని సేకరించడంతోపాటు సరిహద్దుల గుర్తింపు, మ్యాపింగ్ వంటి పనులు పూర్తి చేశారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేయడంతో వార్డుల పునర్విభజన ప్రక్రియను గురువారం నుంచి అధికారికంగా ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు.
వేగంగా విలీనం..
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం ప్రక్రియ వేగంగా జరుగుతోంది. విలీనానికి సంబంధించి, తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌కు చట్టబద్దత, మున్సిపల్ శాఖ నుంచి 27యూఎల్బీల తొలగింపు వంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్‌లను జారీచేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు 27యూఎల్బీలకు రికార్డులను స్వాధీనం చేసుకోవడానికి జీహెచ్ఎంసీ కర్ణన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ప్రక్రియను శుక్రవారం వరకు పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీలకు జీహెచ్ఎంసీ బోర్డులను పెట్టేశారు.
డీ లిమిటేషన్ షురూ..
జీహెచ్ఎంసీలో 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2వేల చదరపు కి.మీ. పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోనున్న 150 వార్డులను పునర్విభజన తర్వాత 250 వార్డులకు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు 27 యూఎల్బీలను మరో 50 వార్డులుగా విభజించే ప్రక్రియ చేపట్టాలని సర్కారు సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే జీహెచ్ఎంసీ విలీనం చేసిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 215 వార్డులు, 20 మున్సిపాలిటీల్లో 407 వార్డులు ఉన్నాయి. వీటిని 30వేల నుంచి 40వేల జనాభా ప్రాతిపదికనా 50వార్డులకు కుదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రతి 40 వేల జనాభాకు ఒక వార్డును ఏర్చాటు చేసే దిశగా పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది. ఒక వార్డును పునర్విభజించేందుకు గాను ఆ ప్రాంతంలోనే నాలాను, మెయిన్ రోడ్డును గానీ ల్యాండ్ మార్క్‌గా తీసుకుని అక్కడి నుంచి 40 వేల జనాభా ఉన్న వరకు మార్కింగ్ చేసుకుని మున్సిపల్ వార్డుగా ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. అయితే 300వార్డులు, 50సర్కిళ్లు, 10 జోన్లుగా ఉండే అవకాశముందని అధికారుల అంచనా వేస్తున్నారు.
ఈనెల 27న ఫైనల్ నోటిఫికేషన్..
జీహెచ్ఎంసీలోని 300వార్డులకు సంబంధించిన డ్రాఫ్ నోటిఫికేషన్ ఈనెల 6వ తేదిన జారీచేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఏడు రోజులపాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. తర్వాత మరో 10రోజులపాటు అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 27వ తేదిన వార్డులకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తెలిపారు.






