- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన.. నాచారం సీఐపై బదిలీ వేటు
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)లో జరిగిన ఘటన నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (Delhi Public School)లో జరిగిన ఘటన నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. బర్త్‌డే వేడుకల్లో భాగంగా తోటి విద్యార్థులు బర్త్‌డే బంప్స్ పేరుతో ఓ విద్యార్థిపై పిడిగుద్దులు కురిపించారు. అనంతరం బాలుడి మర్మాంగాల నుంచి రక్తం కారుతున్నా క్లాస్‌మేట్స్ వదలకపోడంతో పరిస్థితి విషమించింది. దీంతో బాధితుడి తల్లిదండ్రులు విషయాన్ని ప్రిన్సిపల్, పోలీసుల దృష్టి తీసుకెళ్లారు. అనంతరం బాలుడిని మెరుగైన చికిత్స కోసం బంజారాహిల్స్ (Banjara Hills)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటనను పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను సీఐ రుద్వేర్ కుమార్ (Rudveer Kumar)పై బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో కొత్త సీఐగా ధనుంజయ్ (Dhanunjay)ని నియమిస్తూ రాచకొండ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.






