- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి చుక్కెదురు!
ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను మరో నెల రోజుల వరకు పొడిగిస్తూ.. రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను మరో నెల రోజుల వరకు పొడిగిస్తూ.. రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత మార్చి 26 నుంచి తీహార్ జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. కవితపై ఈడీ, సీబీఐ దాఖలు చేసిన రెండు కేసుల్లో జ్యూడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ముందు హజరు పరిచారు.
సోమవారం ఉదయం 10 గంటలకు విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు.. కవిత జ్యూడిషియల్ రిమాండ్ ను జూలై 3 వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఢిల్లీ మద్యం విధానంలో కవిత పాత్ర పై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు.. తీహార్ జైలులో ఉన్న కవిత, చరణ్ ప్రీత్ లకు ప్రొడక్షన్ వారెంట్, మిగిలిన ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుకావలంటూ సమన్లు జారీ చేసింది. చార్జిషీట్ పరిగణనలోకి తీసుకున్న తర్వాత తొలిసారి కవిత ట్రయల్ కోర్టు ముందు హజరు కానున్నారు. సీబీఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు పై మధ్యాహ్నం 2 గం.లకి రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరపనున్నారు.






