- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi Liquor Scam: సీఎం కేజ్రీవాల్, కవితకు మళ్లీ నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
by Kema Shiva Kumar |
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో సహా మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో వారికి ఈ నెల 31 వరకు రిమాండ్‌ను పొడిగించింది. మరోవైపు సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న కోర్టు ఆగస్టు 8 వరకు రిమాండ్ పొడిగిస్తూ గురువారం రాత్రి న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ దాఖలు చేశారు. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను జైలు అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.
Next Story






