అదానీ ఇష్యూ డైవర్ట్ చేసేందుకే తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కామ్: అద్దంకి దయాకర్

by Disha Web Desk 19 |
అదానీ ఇష్యూ డైవర్ట్ చేసేందుకే తెరపైకి ఢిల్లీ లిక్కర్ స్కామ్: అద్దంకి దయాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను పెద్ద సముద్రంలో చిన్న చేపను అని ఎమ్మెల్సీ కవిత చెప్పడం విడ్డూరంగా ఉన్నదని, కానీ ఆ చిన్న చేపనే పెద్ద గేమ్​ఆడిందని టీపీసీసీ స్పోక్స్​పర్సన్​అద్దంకి దయాకర్​విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్​స్కామ్‌లో బీఆర్ఎస్, వైసీపీ, ఆప్​పార్టీల పాత్ర ఉన్నదన్నారు. ఈ లిక్కర్ కుంభకోణంలో ఆ మూడు పార్టీలు కలసి అవినీతికి పాల్పడ్డాయన్నారు. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీలో అక్కడ ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉన్నదన్నారు.

కేవలం ఎక్సైజ్ మంత్రి సిసోడియానే కాకుండా, మిగతాపెద్దల పాత్ర కూడా స్పష్టంగా ఉన్నదని ఆరోపించారు. ఇక ఢిల్లీ సీఎం పాత్ర కూడా ఉన్నదని కానీ.. ఈ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఎందుకు బాధ్యులను చేయలేదని ప్రశ్నించారు. అసలు దోషులను పక్కకు పెట్టి మాములు దోషులను అరెస్ట్​చేసి విచారణ చేయడం వెనక ఆంతర్యమేమిటో? అర్థం కావడం లేదన్నారు. గోవా, పంజాబ్‌లలో కాంగ్రెస్‌ను ఓడించి బీఆర్ఎస్ ఈ డబ్బులను పంచిపెట్టిందన్నారు. ఆప్ అక్కడ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ నష్టపోయిందన్నారు.

లిక్కర్ స్కామ్, లిక్కర్ ఫైల్స్ అన్ని బీజేపీ కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్నారు. బీజేపీ, ఆప్, బీఆర్ఎస్, వైసీపీ కలిసి పని చేస్తున్నాయన్నారు. పాలసీని అమోదించిన లెఫ్ట్నెంట్ గవర్నర్‌ను ఎందుకు బాధ్యులను చేయలేదని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్లో లిక్కర్ అమ్మకాలు అమిత్ షా కొడుకు చూస్తున్నాడన్నారు. మాగుంట రాఘవ, విజయ సాయి తమ్ముడు, మిగతా వారంతా ఈ కేసు నుంచి ఎటు పోయారని అద్దంకి ఫైర్ అయ్యారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాను విచారిస్తే అన్నీ బయటకు వస్తాయన్నారు. ఇప్పుడు కర్ణాటకలోనూ కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి బీర్ఎస్, ఆప్​పనిచేస్తున్నాయన్నారు. మద్యంతో దేశాన్ని నింపి కాంగ్రెస్‌ను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. కవితకు, మాగుంట, విజయ సాయి, కేజ్రీవాల్ లకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నారన్నారు. అదానీ అంశాన్ని ప్రజల మదిలో లేకుండా చేసేందుకే బీజేపీ ఈ లిక్కర్​స్కామ్‌ని తెరమీదకు తీసుకువచ్చిందన్నారు.



Next Story

Most Viewed