బీజేపీ మండలి అభ్యర్ధుల ప్రచారానికి ఢిల్లీ నేతలు

by Muthe.Rajitha |

Delhi leaders for campaigning for BJP council candidates

బీజేపీ మండలి అభ్యర్ధుల ప్రచారానికి ఢిల్లీ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరిగే మూడు శాసనమండలి స్ధానాలకు పోటీ చేసిన బీజేపీ ఖచ్చితంగా మూడు సీట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు ఆపార్టీ అగ్రనేతలు రాజకీయ వ్యుహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి హస్తిన పెద్దలను దించుతున్నారు. గురువారం నుంచి కరీంనగర్​జిల్లాలో ఆపార్టీ సీనియర్​నేత సునీల్​బన్సల్​ప్రచారం చేపడుతారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్​ఒక విడుత ప్రచారం చేసి తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. అయిన గెలుపు అంతా సులభంకాదని కేంద్ర నాయకత్వాన్ని రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్​ఒక గ్రాడ్యుయేట్​స్థానికి పోటీ చేస్తుండగా ప్రతిపక్ష బీఆర్​ఎస్​ఈసారి బరిలో నిలవలేదు. ఇంకా టీచర్ల స్ధానం నుంచి అదికారం, ప్రతిపక్షాలు పోటీ చేయకపోవడంతో వారికి స్వతంత్ర అభ్యర్ధులే పోటీలో ఉన్నారు. వీరందరికి దీటుగా ప్రచారం నిర్వహించి రెండు ఉపాధ్యాయ సీట్లు గెలిచేందుకు ప్లాన్​చేస్తున్నారు. పట్టభద్రులు స్థానం ఒకదానికి కాస్త పోటీ ఉండటంతో అక్కడ హస్తిన పెద్దలు నడ్డా, కేంద్రమంత్రి భూపేందర్​యాదవ్​ను ప్రచారానికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి.

విపక్షాలకు దీటుగా ప్రచారం : కమలనాథులు విపక్షాలను దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యువ విభాగం, మహిళ, బీసీ,ఎస్సీ,ఎస్టీ మోర్చా నాయకులతో పాటు ఏబివిపి విద్యార్ధి నాయకుల సంఘాల నాయకులు కూడా పార్టీ అభ్యర్ధులు గెలుపు కోసం త్రీవంగా శ్రమిస్తున్నారు. ప్రతి ఓటరును కలిసి పదేళ్ల మోడీ పాలనను వివరిస్తూ కాంగ్రెస్, బీఆర్​ఎస్​పార్టీల మోసపూరిత హామీల గురించి చెబుతున్నారు. ఆపార్టీలను నమ్మితే ఏమి ఉండదని, ఈసారి బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరుతున్నారు.

కాంగ్రెస్ ను ఓడించేందుకు కమలం వైపు బీఆర్​ఎస్​నేతల మొగ్గు : ప్రతిపక్ష బీఆర్​ఎస్​ క్యాడర్​అంతా కమలనాథుల వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆపార్టీ పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్​వారికి ప్రదాన శత్రువు కావడంతో దానిని ఓడించేందుకు బీజేపీని గెలిపించేందుకు రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈఎన్నికల్లో అధికార పార్టీ ఓడితే ఈప్రభావం వచ్చే స్ధానిక ఎన్నికల్లో పడుతుందని అది తమకు కలిసి వస్తుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్​, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్​జిల్లాలో బీఆర్​ఎస్ కు​ బలమైన క్యాడర్​ ఉంది. వారంతా బీజేపీకే మొగ్గు చూపుతారని రెండు పార్టీ కార్యాలయాల్లో టాక్​వినిపిస్తోంది. కాంగ్రెస్​నేతలు కూడా ఆరెండు పార్టీలు ఒకటైన తమను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ప్రచారంలో విమర్శలు చేస్తున్నారు.

Next Story