- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Alleti Maheshwar Reddy : తెలంగాణలో సమస్యలు పక్కదారి పట్టించేందుకే ఢిల్లీ ధర్నా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ(Delhi)లోని జంతర్ మంతర్(Jantar Mantar) వేదికగా బీసీ సంఘాల మహా ధర్నా(BC Groups Protest) జరుగుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీ(Delhi)లోని జంతర్ మంతర్(Jantar Mantar) వేదికగా బీసీ సంఘాల మహా ధర్నా(BC Groups Protest) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సహ ముఖ్య నేతలంతా హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుహున్న ఈ మహాధర్నాపై బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ఈ ధర్నా నెత్తికి ఎత్తుకుందని ఆరోపించారు.
పంటలకు నీరు అందక ఒకవైపు పొలాలు ఎండుతుంటే వాటి గురించి ఆలోచించే కాంగ్రెస్ నాయకుడే లేడని అన్నారు. ఎన్నికల హామీల్లో ముఖ్యమైన రైతు హామీని పూర్తి చేయకుండానే మమ అనిపించారని ఎద్దేవా చేశారు. వర్శిటీకి చెందిన భూముల వివాదంపై ఇంత చర్చ నడుస్తుంటే.. సీఎం స్థాయి వ్యక్తి రాష్ట్రాన్ని వదిలి దేశ రాజధానిలో స్వయంగా పక్కన ఉండి ధర్నాలు, నిరసనలు చేయించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.






