- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. అనుమానితుడు ఉమర్ అహ్మద్ ఫొటో వెలుగులోకి

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi) ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు (Delhi Bomb Blast) ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ మేరకు పోలీసులు యూఏపీఏ (UAPA), ఎక్స్‌ప్లోసివ్ చట్టాల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం బ్లాస్టింగ్‌కు కారణమైన అనిమానితుడు డాక్టర్ ఉమర్ అహ్మద్ ఫొటోగ్రాఫ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అతడి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేలుడుకు కారణమైన హ్యూందాయ్ ఐ 20 కారుకు సంబంధించిన దృశ్యాలు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. అతడు డాక్టర్ ఉమర్ అహ్మద్ (Umar Ahmad) అని అనుమానిస్తున్నట్లుగా సమాచారం. ఇతడికి ఫరీదాబాద్ (Faridabad) మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఐ 20 కారును చివరిసారిగా పుల్వామాకు చెందిన తారిఖ్ కొనుగోలు చేసినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది.
కాగా, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌ను దర్యాప్తు సంస్థలు ఆత్మాహుతిగా భావిస్తున్నాయి. కారలో భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. పేలుడు పదార్థాల్లో అమ్మోనియం సైట్రేట్, డిటోనేటర్లు, ఇంధన చముురు ఉన్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అదేవిధంగా ఈ పేలుడు ఫరీదాబాద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. పేలిన కారులో డాక్టర్ ఉమర్ అహ్మద్ ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు మృతుడి డీఎన్ఏ శాంపిల్స్ పోలీసులు సేకరించి ఫోరెన్సిక్ డిపార్డ్మెంట్కు పంపారు.
READ MORE ....






