- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ పేలుడు.. హైదరాబాద్ లో హై అలర్ట్
ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్స్, బస్టాండ్స్ లో తనిఖీలు చేస్తున్నారు

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. మెట్రోస్టేషన్ గేట్ - 1 దగ్గర పార్క్ చేసిన కారులో పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు ధాటికి పూర్తిగా మొత్తం 5 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇక ఢిల్లీ పేలుడు నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ లోని రైల్వేస్టేషన్స్, బస్టాండ్స్ లో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్.. శంషాబాద్ ఎయిర్ పోర్డులో తనిఖీలు జరుగుతున్నాయి. MGBS, JBS, పలు బిస్టాండ్స్ రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్న పోలీసులు.. అనుమానం వచ్చిన వాళ్లను అస్సలు వదలడం లేదు. ఇక రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్న తరుణంలో ఆ నియోజక వర్గంలో ఆర్మీ అధికారులు తనిఖీలు చేస్తున్నారని సమాచారం.
READ MORE ....
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. అనుమానితుడు ఉమర్ అహ్మద్ ఫొటో వెలుగులోకి






