- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: నేడు ఢిల్లీలో బీసీ సంక్షేమ సంఘాల మహా ధర్నా.. హాజరుకానున్న రాహుల్, రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ (Delhi) చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీ (Delhi) చేరుకున్నారు. విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించే రెండు బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ బిల్లులను పార్లమెంట్ (Parliament)లో ఆమోదించి, షెడ్యూల్-9 (Schedule-9)లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఢిల్లీ (Delhi)లోని జంతర్‌మంతర్ (Jantar Mantar) వద్ద 12 బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నారు.
ఈ మహా ధర్నాకు హాజరు కావాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ (Congres), బీఆర్‌ఎస్ (BRS), ఎంఐఎం (MIM), వామపక్షాలతో పాటు బీజేపీ (BJP) నేతలను బీసీ సంఘాల నేతలు ఇప్పటి సమాచారం అందజేశారు. ఈ నేపథ్యంలోనే ధర్నాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకరయ్య ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఏఐసీసీ చీఫ్ మల్లికార్జుణ్ ఖర్గే, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొననున్నట్లుగా సమాచారం. ధర్నా అనంతరం బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా జాతీయ నేతలతో భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.






