రాష్ట్ర ప్రభుత్వం వల్లే పనులు ఆలస్యం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   (  Updated:2025-02-25 10:51:48  IST  )

రాష్ట్ర ప్రభుత్వం (State Government) వల్లే ప్లైఓవర్ పనుల్లో (Flyover Works) ఆలస్యం నెలకొన్నదని, దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులకు లేఖలు రాశానని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వల్లే పనులు ఆలస్యం.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం (State Government) వల్లే ప్లైఓవర్ పనుల్లో (Flyover Works) ఆలస్యం నెలకొన్నదని, దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులకు లేఖలు రాశానని కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. మంగళవారం ఉదయం కిషన్ రెడ్డి R& B, నేషనల్ హైవే అధికారులు, GHMC అన్ని విభాగాల అధికారులు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, రెవిన్యూ అధికారులతో కలిసి హైదరాబాద్ లోని అంబర్ పేట్ ఫ్లైఓవర్ (Amberpet Flyover) ను పరిశీలించారు. గోల్నాక చర్చ్ నుంచి అంబర్ పేట్ వాణి ఫోటో స్టూడియో వరకు ఫ్లైఓవర్ పై నడుస్తూ అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాదర్ ఘట్ నుంచి వరంగల్ కు వెళ్లే జాతీయ రహదారికి గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రోడ్డు వైండింగ్ చేయడం జరిగిందని తెలిపారు.

అంబర్ పేట చే నెంబర్ వద్ద రెండు వైపులా శ్మశాన వాటిక ఉండటంతో రోడ్డు వైండింగ్ కుదరలేదని, తాను అంబర్ పేట శాసనసభ్యుడిగా, సికింద్రబాద్ ఎంపీగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. శ్మశాన వాటిక ఉన్నందున ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కోరానని అన్నారు. అలాగే ఈ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటుందని, స్థానిక ప్రజలు కూడా నిత్యం ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారని, ఈ జాతీయ రహదారి గుండా వెళ్లే వరంగల్, ఖమ్మం ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ప్రధానమంత్రిని (Prime Minister) కోరగా ఆయన వెంటనే ఒప్పుకొని మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) కానీ, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కానీ ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూర్తిగా సహకరించి పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి, మిగతా ఐదు చోట్ల భూసేకరణ చేసి సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఒకచోట భూసేకరణకు సంబంధించి రూ.2 కోట్ల 51 లక్షలు చెక్కు తీసుకున్న తర్వాత కూడా భూసేకరణకు స్థలం నేషనల్ హైవే అథారిటికి అప్పగించలేదని, దాన్ని త్వరగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. అంతేగాక జీహెచ్ఎంసీ (GHMC), నేషనల్ హైవే అధికారులతో (National High Way) ఇటీవల తాను ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించానని, ఫ్లైఓవర్ కింద మంచి రోడ్డు వేయడంతో పాటు, గ్రీనరీ (Greenary), బ్యూటిఫికేషన్ చేయాలని అధికారులను సూచించినట్లు తెలిపారు. ఈ ఫ్లైఓవర్కు సంబంధించి గతంలో కేసీఆర్ (KCR) కు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి (Revanth Reddy) అనేక ఉత్తరాలు రాశానని, భూసేకరణ ను వేగవంతం చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, మిగిలిపోయిన ఆరు చోట్ల భూసేకరణను చేపట్టాలని కోరారు. ఇక ఈ ఫ్లైఓవర్ కోసం ఇప్పటి వరకు రూ.338 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, ఏండ్ల తరబడి ట్రాఫిక్ కష్టాలకు రేపటి శివరాత్రితో కొంత ఉపశమనం కలుగనుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Next Story