ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. మొదటి రోజు ముగిసిన విచారణ

by Prasad Jukanti |

పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. మొదటి రోజు ముగిసిన విచారణ
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలలకు సంబంధించిన కేసుపై (Defected MLAs Case) మొదటి రోజు స్పీకర్ విచారణ ముగిసింది. ఇవాళ తన చాంబర్‍లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ప్రత్యక్ష విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ కొనసాగింది. ఇవాళ విచారణకు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు వారి తరఫు న్యాయవాదులు హాజరయ్యారు. వీరితో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు వీరి తరఫున న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిటిషన్ దారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులకు మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఈ విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో పలు ఆంక్షలు విధించారు.

Next Story