- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత మున్సిపాలిటీలో ఓటమి.. ‘మల్‌రెడ్డి’కి మంత్రి పదవి లేనట్లేనా!
సొంత నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి అవకాశాలు సందిగ్ధంలో పడ్డాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి ఆశలకు చెక్ పడిందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. అందుకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కారణంగా చూపుతున్నారు. సొంత సెగ్మెంట్‌లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేని వ్యక్తికి మంత్రి పదవి అడిగే నైతికత ఉంటుందా? అని ఆయన వ్యతిరేకులు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్న ఇతర ఎమ్మెల్యేలు కేబినెట్ బెర్త్ తమను వరిస్తుందన్న దీమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి పబ్లిక్‌గానే డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాదని, అందుకు ప్రతిగా చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని పార్టీ ఆఫర్ ఇవ్వగా అందుకు అంగీకరించకుండా మంత్రి పదవి కావాలని తేల్చిచెప్పినట్లు ప్రచారం జరిగింది. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ వేళ సర్దుబాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ కీలక నేతలు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గం కేంద్రంగా ఉన్న ఇబ్రహీంపట్నంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం చెందడంతో ఆయన పేరును ఇప్పుడు ఆశావహుల లిస్టు నుంచి తొలగించే పరిస్థితి ఏర్పడిందని పార్టీలో చర్చ జరుగుతన్నది.
అలర్ట్ చేసినా పట్టించుకోలే..
ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న మల్‌రెడ్డి రంగారెడ్డికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మంచి మెజార్టీతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని గెలుస్తామని ధీమాలో ఉన్న ఆయనకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. బీఆర్ఎస్ అత్యధికంగా 13 వార్డులు గెలిచుకుని చైర్మన్ పదవిని సొంతం చేసుకునే మెజార్టీని సాధించింది. దీంతో కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని గెలుచుకునేందుకు ఉపయోగించిన వ్యూహాలు సైతం బెడిసికొట్టాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నియోజకవర్గంలో పార్టీ బలహీనంగా ఉందని నిఘా వర్గాలు మొదటి నుంచి అలర్ట్ చేసినా ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ పంచాయితీలను బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. వెంటనే పార్టీ బలోపేతంపై ఎమ్మెల్యే ఫోకస్ పెట్టి ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు కామెంట్ చేస్తున్నారు.
- Tags
- Malreddy Rangareddy
- Ibrahimpatnam MLA
- Telangana Congress
- Cabinet Berth
- Ministerial Post
- Ibrahimpatnam Municipal Elections
- Rangareddy District Politics
- Telangana Cabinet Expansion
- Political Analysis
- Municipal Election Results
- BRS Victory
- Senior MLA
- Telangana Politics
- Revanth Reddy Cabinet
- Constituency Performance
- Local Body Elections.






