కామారెడ్డిలో పొలిటికల్ హీట్.. ఎమ్మెల్యే రమణారెడ్డికి కోర్టు నోటీసులు

by Prasad Jukanti |   (  Updated:2026-05-02 09:46:26  IST  )

షబ్బీర్ అలీ కుమారుడు ఇలియాస్ వేసిన పరువు నష్టం దావాలో ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డికి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది.

కామారెడ్డిలో పొలిటికల్ హీట్.. ఎమ్మెల్యే రమణారెడ్డికి కోర్టు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొంత కాలంగా కామారెడ్డి రాజకీయాల్లో ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి వర్సెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య రాజకీయం రంజుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రమణారెడ్డిపై షబ్బీర్‌ అలీ కుమారుడు ఇలియాస్‌ పరువు నష్టం దావా వేశాడు. తన పరువుకు భంగం కలిగేలా ఎమ్మెల్యే రమణారెడ్డి ఆరోపణలు చేశారంటూ ఆరోపించారు. దీనిపై రమణారెడ్డికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 20న హాజరు కావాలని ఆదేశించిన ప్రత్యేక కోర్టు ఆదేశించింది. షబ్బీర్ అలీ కుమారుడిపై రేప్ కేసు ఉందంటూ కాటిపల్లి ఆరోపించారని ఆయనపై అత్యాచారం కేసు కాదు కదా కనీసం పిటి కేస్ కూడా లేదని ఇలియాస్ తరఫు న్యాయవాదులు తెలిపారు.

Next Story