- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ సమ్మిట్‌లో ఉగ్రవాదంపై డిక్లరేషన్
హైదరాబాద్ వేదికగా జరుగబోయే భారత్‌సమ్మిట్ 2025లో తెలంగాణ కల్చర్‌తో ఆర్భాటంగా ఆహ్వానం పలుకేందుకు కార్యక్రమాలు రూపొందించాం.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ వేదికగా జరుగబోయే భారత్‌సమ్మిట్ 2025లో తెలంగాణ కల్చర్‌తో ఆర్భాటంగా ఆహ్వానం పలుకేందుకు కార్యక్రమాలు రూపొందించాం. కానీ కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో యావత్‌దేశం దు:ఖిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గురుపాల్ సఫల్ పేర్కొన్నారు. హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో సీడ్లబ్యూసీ ప్రత్యేక సమావేశం నిర్వహించిందని, ఇందులో పార్టీ అధ్యక్షుడు ఖర్గే, సోనియాగాంధీ, ఇతర నేతలు పాలుపంచుకున్నారని తెలిపారు. అయితే ఈ సమయం సెలబ్రేషన్స్ చేసుకునేది కాదని నిర్ణయం తీసుకోవడ జరిగిందని పేర్కొన్నారు. దాంతోనే భారత్సమ్మిట్సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ప్రారంభ వేడుకలను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.
యవత్భారత్ఈ ఉగ్రవాదంపై ఆలోచన చేయాల్సిన సమయని పేర్కొన్నారు. ఈ సమ్మిట్లో టెర్రరిజంపై డిక్లరేషన్చేయననున్నామని తెలిపారు. టెర్రరిజంపై కాంగ్రెస్‌పార్టీ విరోచితంగా పోరాడిందన్నారు. కాంగ్రెస్హయంలో పంజాబ్, అస్సాంలో టెర్రరిజాన్ని మట్టుబెట్టమన్నారు. నార్త్‌ఇండియాలోని రాష్ట్రాలలో కూడా ఉగ్రవాదాన్ని రూపుమాపామన్నారు. కశ్వీర్‌లో కూడా ఉగ్రవాదాన్ని కంట్రోల్‌లోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయంలో కాంగ్రెస్‌పార్టీ రాజీపడే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. ఈ సమ్మిట్‌లో ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్‌కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
భారత్సమ్మిట్ను రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. ఈ ప్రపంచంలోని పొలిటికల్పార్టీలు వాళ్లందరినీ ఏకతాటిపై తీసుకొచ్చేందుకు మొదలుపెట్టామన్నారు. ఈ సదస్సులో వందకుపైగా దేశాల నుండి 450 మందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. 25 నుంచి 30 మంది మంత్రులు, 15 రాజకీయ పార్టీల అధ్యక్షులు, 50 మంది వరకు ఎంపీలు, సెనేటర్లు, ఇన్వెస్టర్లు ఈ సమావేశానికి విచ్చేస్తున్నారి ఆయన తెలిపారు.






