- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతోంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కాంగ్రెస్ మోసపూరిత పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ మోసపూరిత పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయానికి ఎవరు ఏం చేశారో చర్చిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన సవాల్‌ను స్వీకరించిన ఆయన చర్చకు సిద్ధమయ్యారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌కు చేరకుని అక్కడి నుంచి ప్రెస్ క్లబ్‌కు వెళుతూ.. మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో రైతులు సహా అన్ని వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. గత 18 నెలలుగా రాష్ట్రంలో మోసపూరిత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టరని.. ఒకవేళ పెట్టినా తమకు మైక్ ఇచ్చిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఢిల్లీలో ఉన్నారని తెలిసిందని.. మంత్రులతో అయినా తాను చర్చకు సిద్ధమేనని ప్రభుత్వానికి సంచలన సవాల్ విసిరారు. ఇవాళ కాకపోయినా మరో రోజు వచ్చినా సరే.. తాము చర్చకు సిద్ధమని అన్నారు. కొడంగల్‌లో ఇంతవరకు రైతు బంధు పడని 670 మంది జాబితాతో సహా ప్రెస్‌క్లబ్‌కు చర్చకు వెళ్తున్నానని తెలిపారు. అనంతరం కేటీఆర్, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంగుల కమలాకర్, మేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌లతో కలిసి భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్ నుంచి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరారు.






