- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Farmers Commission: చిరుధాన్యాల సాగులో ప్రత్యేకతను సాధించిన డెక్కన్ రైతులు : రైతు కమిషన్
సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, కొర్రలు, కందులు ఇతర చిరుధాన్యాలు, పప్పుదినుసుల డెక్కన్ రైతులు సాగు చేయడం అభినందనీయమని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, కొర్రలు, కందులు ఇతర చిరుధాన్యాలు, పప్పుదినుసుల డెక్కన్ రైతులు సాగు చేయడం అభినందనీయమని రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి (Farmers Commission Chairman Kodanda Reddy) పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా సహజ సిద్దమైన వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ రైతులు దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇతర దేశాల రైతులకు సైతం శిక్షణ ఇచ్చే స్థాయికి దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ రైతులు ఎదగడం గొప్ప విషయమన్నారు. గురువారం వారు పండించే చిరుధాన్యాలతో తయారు చేసిన ఉత్పత్తులు దీపావళి సందర్భంగా స్వీట్స్ ను రైతు కమిషన్ సభ్యులకు కేవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి లకు అందజేశారు.
ఎన్నో ఏళ్లుగా వరి సాగు చేసే పద్దతుల గురించి వివరించారు. 30-40 ఏళ్లుగా సహజ పద్ధతుల్లోనే సాగు చేస్తూ భూమిని, ఆరోగ్యాలను కాపాడుతున్నట్టు మహిళా రైతులు తెలిపారు. సంఘంలో చేరి ఐక్యంగా సహజ సాగు చేస్తున్నట్లు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల రైతులు కూడా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ రైతులను ఆదర్శంగా తీసుకొని పంటల సాగు చేయాలని రైతు కమిషన్ పిలుపునిచ్చింది.






