Hyderabad : కల్తీకల్లు ఘటన... ఐదుకు చేరిన మృతులు.. 31కి చేరిన బాధితులు

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

Hyderabad : కల్తీకల్లు ఘటన... ఐదుకు చేరిన మృతులు.. 31కి చేరిన బాధితులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి(Kukatpally)లో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య ఐదుకు చేరింది. అలాగే బాధితుల సంఖ్య 31కి పెరిగింది. శేరిలింగంపల్లిలోని కల్లు కాంపౌండ్‌లో కల్తీకల్లు(Kalthi kallu) తాగి మంగళవారం 15మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే 24 గంటల అనంతరం బాధితుల్లో ఐదుగురు పరిస్థితి విషమించి మరణించారు. అలాగే నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

మృతులు వీరే

*సీహెచ్ బొజ్జయ్య

*కలగళ్ల సీతారాం

*చౌదరిమెట్టు స్వరూప

*నారాయణ

*మౌనిక

Next Story