- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్లపై మృత్యుపాశం చైనా మంజా.. గుజరాత్ జుగాడ్ హైదాబాద్‌కూ రావాలి.. నెటిజన్ల డిమాండ్
హైదరాబాద్ నగరంలో చైనా మంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో చైనా మంజా మరోసారి ప్రాణాంతకంగా మారుతోంది. నిషేధం ఉన్నప్పటికీ కొందరు అక్రమంగా చైనా మంజాను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా మేడలు, అపార్ట్‌మెంట్లపై నుంచి పతంగులు ఎగరవేస్తున్న సమయంలో తెగిపోయిన మంజా రోడ్లపై వేలాడుతూ ద్విచక్ర వాహనదారులకు మృత్యుపాశంగా మారుతోంది. చాలా చోట్ల బైక్‌పై వెళ్లే వారి మెడకు, ముఖానికి మంజా చుట్టుకొని తీవ్ర గాయాలు జరుగుతున్నాయి. వాహన వేగం ఎక్కువగా ఉన్నప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో పక్షులు మంజాకు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ప్రజలను కలచివేశాయి.
గుజరాత్ పోలీసులు అమలు చేసిన ప్రయోగం
ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ పోలీసులు అమలు చేస్తున్న వినూత్న ప్రయోగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గుజరాత్‌లో పతంగుల పండుగ ఉత్సాహంగా జరుగుతుండటంతో, ద్విచక్ర వాహనదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బైక్, స్కూటర్ హ్యాండిల్ వద్ద మెటల్ ‘స్ట్రింగ్ ప్రొటెక్టర్’ ఏర్పాటు చేశారు. రోడ్డు మీద వేలాడుతున్న మంజా వాహనానికి తగిలిన వెంటనే అది ఆ గార్డ్‌లోకి చుట్టుకొని పోతుంది. దీంతో మంజా నేరుగా రైడర్ మెడకు లేదా ముఖానికి తగలకుండా ప్రాణాపాయాన్ని తప్పిస్తుంది. ఇప్పటికే ఈ విధానం పలువురు ప్రాణాలను కాపాడిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే తరహా ‘జుగాడ్’ను హైదాబాద్‌లోనూ అమలు చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.‘చైనా మంజాను పూర్తిగా నిర్మూలించలేకపోతే, కనీసం ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలి’ అని తెలంగాణ పోలీసులకు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
సంక్రాంతి వంటి పండుగల వేళ నగరంలో పతంగుల సందడి పెరుగుతున్న నేపథ్యంలో, టూ వీలర్‌లకు సేఫ్టీ గార్డ్స్ తప్పనిసరి చేయాలన్న డిమాండ్ బలపడుతోంది. గుజరాత్ మాదిరిగా హైదరాబాద్‌లోనూ ఈ ప్రయోగం అమలైతే అనేక అమూల్యమైన ప్రాణాలు కాపాడవచ్చని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ఇదే..






