పెండింగ్ టౌన్ ప్లానింగ్ అంశాలకు గడువు : కమిషనర్ సృజన కీలక ఆదేశాలు

by Ramesh Naini |

బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీని నిర్ణిత కాలపరిమితిలోగా క్లియర్ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశించారు.

పెండింగ్ టౌన్ ప్లానింగ్ అంశాలకు గడువు : కమిషనర్ సృజన కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బిల్డింగ్ పర్మిషన్లు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీని నిర్ణిత కాలపరిమితిలోగా క్లియర్ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశించారు. పెండింగ్ అంశాలను నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని, నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అంశాలు సకాలంలో పరిష్కారం చేయడంతోపాటు అమలుపై దృష్టి సారించాలని కమిషనర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ, ఆక్యుపెన్సీ దరఖాస్తులు, కోర్టు కేసులు, కోర్టు ధిక్కరణ కేసులు, ప్రజా ఫిర్యాదులు, అనధికార నిర్మాణాలు, ఆక్రమణల తొలగింపుపై సమీక్ష నిర్వహించారు.

అన్ని దరఖాస్తులు, ఫిర్యాదులను ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, పారదర్శకత, జవాబుదారితనం పాటించాలని సూచించారు. అనధికార నిర్మాణాలు, ఆక్రమణలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్, యూబీడీ, ఇంజనీరింగ్, ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటూ దశలవారీగా ఆక్రమణలను తొలగించాలని సూచించారు.

Next Story