GHMC డీలిమిటేషన్‌పై అభ్యంతరాల గడువు పెంపు

by Gantepaka Srikanth |

GHMC డీలిమిటేషన్‌పై అభ్యంతరాల గడువు పెంపు

GHMC డీలిమిటేషన్‌పై అభ్యంతరాల గడువు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌(GHMC Delimitation)పై అభ్యంతరాల గడువును మరో రెండ్రోజుల పాటు పెంచుతూ హైకోర్టు(Telangana High Court) నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో అభ్యంతరాలను సమర్పించాలని ఆదేశించింది. డీలిమిటేషన్‌ మ్యాప్, జనాభా వివరాలను 24 గంటల్లో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ఆదేశాల్లో పేర్కొంది.

కాగా, డీలిమిటేషన్‌ మ్యాప్‌ను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టలేదని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పునర్విభజనపై సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. జనాభా, సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా పునర్విభజన మ్యాప్‌ను హైకోర్టుకు సమర్పించామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) తెలిపారు. నియోజకవర్గం మారకుండానే వార్డుల విభజన జరిగిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏజీపై హైకోర్టు ధర్మాసనం సీరియస్‌ అయ్యింది. డీలిమిటేషన్‌ మ్యాప్‌, జనాభా వివరాలను పబ్లిక్‌ డొమైన్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. 24 గంటల్లో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ఆదేశించింది.

Next Story