- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలకొండపల్లికి దేశస్థాయిలో గుర్తింపు తెచ్చిన ఉద్యోగి డిడి ముత్యాలు
ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ అధికారులు ప్రజలు, రైతుల మనసులు గెలుచుకునే విధంగా సేవలందిస్తే, ఆ అధికారులు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మర్చిపోలేరని రంగారెడ్డి జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధ్యక్షులు శక్రు నాయక్ అన్నారు.

దిశ, తలకొండపల్లి: ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ అధికారులు ప్రజలు, రైతుల మనసులు గెలుచుకునే విధంగా సేవలందిస్తే, ఆ అధికారులు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మర్చిపోలేరని రంగారెడ్డి జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధ్యక్షులు శక్రు నాయక్ అన్నారు. దీనికి ఖమ్మం జిల్లా సరికల్చర్ డిడి పదవి విరమణనే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. తలకొండపల్లి మండలంలో శనివారం పద్మ గార్డెన్ లో పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధ్యక్షులు శక్రు నాయక్, డాక్టర్ హేమ్లాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా సెరికల్చర్ డిడి ముత్యాలు ఆయన సతీమణి శ్రీలత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా సెరికల్చర్ ఏడిగా గతంలో ఇక్కడ 7 సంవత్సరాల పాటు నిర్విరామంగా బాధ్యత నిర్వహించి, గత 2 సంవత్సరాల క్రితం పదోన్నతి పై ఖమ్మం డిడిగా ముత్యాలు బదిలీ అయ్యారు. ఈనెల మే 31వ తేదీన ముత్యాలు పదవి విరమణ కార్యక్రమం ఉందని రైతులు ముందుగానే తెలుసుకొని, శనివారం మండల కేంద్రంలోని ముత్యాలు దంపతుల పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా పూలమాలు శాలువాలతో సన్మానించి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శక్రు నాయక్, డాక్టర్ హేమ్లాల్, శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో శ్రీకాంత్ మరి కొంతమంది ఆదర్శ రైతులు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలోని విధులు నిర్వహిస్తున్న సమయంలో ముత్యాలు సారు మాతో పట్టు పరిశ్రమపై అవగాహన కల్పించి ప్రోత్సహిస్తూ పట్టు పరిశ్రమను పట్టుబట్టి స్థాపింపజేసి నేడు రాష్ట్రస్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలో సైతం తలకొండపల్లి మండలం, కోరింతకుంట తండా పేరు గుర్తింపు తీసుకురావడానికి కృషి చేసిన అలాంటి అధికారి నేడు పదవి విరమణ పొందుతున్నాడు అంటే మాకు ఎంతగానో బాదెస్తుందని కొంతమంది రైతులు భావోద్వేగంతో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా కేంద్ర మంత్రులు సైతం గుర్తించే విధంగా పట్టు పరిశ్రమను స్థాపించిన అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, అత్యధిక లాభాలు గడించే పట్టు పరిశ్రమను స్థాపించినందుకు నేతలు, అధికారులు సైతం గుర్తించి ఉత్తమ రైతులను సన్మానించడం, ప్రశంసా పత్రాలను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆనాడు ముత్యాలు ఏడి గిరిజన రైతులతో మాట్లాడి ఇక్కడ బీజం వేస్తే నేడు దేశ స్థాయిలోనే పేరు రావడానికి మాకు అవకాశం లభించిందని కొంతమంది రైతులు కన్నీటి పర్యంతం వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. ఇలాంటి అధికారులు పదవి విరమణ పొందినా కూడా మళ్లీ ప్రత్యేకంగా విధుల్లోకి తీసుకొని రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని జిల్లా కలెక్టర్ ను, ఉన్నత స్థాయి అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో
మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, సేరి కల్చర్ ఎస్ఓ సందీప్, తలకొండపల్లి ఎంపీడీవో శ్రీకాంత్, ఏపీఓ కృష్ణ, హౌసింగ్ ఏఈ చక్రి,మంచల్ మండల్ ఏపీవో లింగయ్య, కోరింతకుంట తండా సర్పంచ్ సరోజ రవీందర్, సెక్రటరీ శ్రీశైలం, పట్టు పరిశ్రమ సాగు చేస్తున్న రైతులు యాదగిరి ,రమేష్, శంకర్, మల్లేష్, వినోద్ కుమార్, దసురు, చరణ్ బాలు రమేష్ శ్రీను నరసింహ భోజిరెడ్డి, శేఖర్ రెడ్డి, బాలు, ప్రకాష్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






