సీఎం రేవంత్ మగాడు, ద‌మ్మున్నోడు.. కేటీఆర్‌కు అద్దంకి దయాకర్ కౌంటర్

by Ramesh Naini |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.

సీఎం రేవంత్ మగాడు, ద‌మ్మున్నోడు.. కేటీఆర్‌కు అద్దంకి దయాకర్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (MLC Addanki dayakar) కౌంటర్ ఇచ్చారు. ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దీనస్థితిలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఉన్నారని, రేవంత్ రెడ్డి చంకలో చేరి అభివృద్ధి కోసమని ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై శనివారం అద్దంకి దయాకర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప‌దేళ్ల‌లో 39 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను (BRS) బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు నీ మొహం ఎటుపోయింది? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మగాడు, ద‌మ్మున్నోడు కాబట్టే తొడ‌ కొట్టి మిమ్మల్ని ఓడించి ఫామ్‌హౌస్ కు పంపించాడని కేటీఆర్‌ను విమర్శించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఫైయిల్ అయ్యారని అన్నారు. సుద్ద‌పూస మాటలు మాట్లాడితే తెలంగాణ ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోరని అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు.

Next Story