- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక క్యాన్సర్ మహమ్మారితో పోరాటమే.. పద్మ అవార్డు రావడంపై స్పందించిన నోరి దత్తాత్రేయుడు
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి ‘పద్మ’ పురస్కారం వరించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి ‘పద్మ’ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన వైద్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు. అవార్డు రావడంపై తాజాగా ఆయన స్పందించారు. సోమవారం హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
సొంత గడ్డపై గుర్తింపు దక్కడం...
తనకు పద్మభూషణ్ అవార్డు రావడంపై డా. నోరి దత్తాత్రేయుడు ఆనందం వ్యక్తం చేశారు. వరల్డ్‌వైడ్‌గా ఎన్నో అవార్డులు వచ్చినా.. తాను చేసిన సేవలు, ఆవిష్కరణలకు గుర్తుగా భారత్ ఈ అవార్డు ఇవ్వడం సంతృప్తి కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు. సొంత గడ్డపై నాకు గుర్తింపు దక్కడం అన్నింటికంటే సంతోషం అని అన్నారు. ఈ పురస్కారం.. రాబోయే రోజుల్లో క్యాన్సర్ మహమ్మారిపై పోరాటాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలన్న తన సంకల్పానికి ఇది ఛాలెంజ్ లాంటిదని ఆయన స్పష్టం చేశారు. అలాగే క్యాన్సర్ గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాన్సర్‌కు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు అన్నారు. చాలా రకాల క్యాన్సర్‌లు మళ్లీ రాకుండా చేయొచ్చు అని, ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, వ్యాక్సిన్‌లు వచ్చాయన్నారు. అన్ని దేశాల్లో క్యాన్సర్ సెంటర్లను ఓపెన్ చేసినట్లు వివరించారు.






