MLC: బడ్జెట్‌ను చీట్ చేసే సీఎం ఎక్కడైనా ఉంటారా?

by Gantepaka Srikanth |

రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. అబద్ధాలు, మోసాల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు.

MLC: బడ్జెట్‌ను చీట్ చేసే సీఎం ఎక్కడైనా ఉంటారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. అబద్ధాలు, మోసాల పునాదుల మీద రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌పై పనిగట్టుకుని రేవంత్‌రెడ్డి బురద చల్లుతున్నారని.. అప్పుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. రూ.3 లక్షల 47 వేల కోట్ల అప్పు తెచ్చానని సీఎం చెప్పారని.. అదే సమయంలో రూ.3 లక్షల 30 వేల కోట్ల అప్పు కట్టాను చెబుతున్నారని అన్నారు. కేసీఆర్ రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని దుష్ప్రచారం చేశారని.. ప్రభుత్వం చెల్లించిన అప్పు కేవలం రూ.లక్షా 67 వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికి అసెంబ్లీ వేదికగా రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం అబద్ధమని తాను మండలిలో మాట్లాడితే అభ్యంతరం తెలిపారని.. అసెంబ్లీలో సీఎం అబద్ధాలు మాట్లాడితే ఏం చేయాలో ప్రజలు తేల్చాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌ను చీట్ చేసే సీఎం ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ ప్రవేశపెడుతున్న ప్రైవేటు బిల్లుకు సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు. మరోవైపు.. 2026-27లో విద్యా శాఖకు బడ్జెట్ నిధుల కేటాయింపులు తగ్గాయని.. కేవలం 8 శాతం మాత్రమే నిధులు ఇచ్చారని.. దీనిపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితోపాటు సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు.

Next Story