- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం ఓయూకు వెళ్తే నాలుగు మంచి మాటలు మాట్లాడతారని అనుకున్నామని, కానీ కుక్క తోకకు రాయి కట్టినట్టు ఆయన తీరు మారలేదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం ప్రసంగం గందరగోళంగా, పూర్తిగా విషపూరితమైనదిగా ఉన్నదని విమర్శించారు. ప్రతి వేదికను కేసీఆర్‌పై ద్వేషం వెదజల్లేందుకు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నల్లమల అడవులతో సీఎంకు ఎలాంటి సంబంధం లేదని, పుట్టిన కొండారెడ్డిపల్లి నుంచి నల్లమలకు గంటన్నర ప్రయాణమని, మొగిలి లాంటి క్రూర జంతువులతో ఆడుకున్నాడేమో అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ ఓయూలో ఉద్యమం గురించి మాట్లాడటం సిగ్గుచేటని, యాదయ్య, వేణుగోపాల్‌రెడ్డి లాంటి అమరులు తెలంగాణ ద్రోహుల వల్లే ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. రేవంత్ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నవారని ఆరోపించారు. కేసీఆర్ స్థాపించిన గురుకులాలను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో నిర్వీర్యం చేస్తున్నారని, 2.5 లక్షల మందికి నాణ్యత విద్యనిస్తూ మిగతా 15 లక్షల మందిని విద్యకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లపై బీసీల గొంతు కోసి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం డ్రామా అని అన్నారు.
స్కిల్ యూనివర్సిటీలో పట్టుమని పది కోర్సులు లేవని, స్పోర్ట్స్ యూనివర్సిటీకి తెలంగాణ నిపుణులు లేరని కేరళ నుంచి వీసీ తెచ్చారని విమర్శించారు. తనకు రాని ఇంగ్లిష్ ఇతరులకు రాకూడదనేది రేవంత్ విధానమని ఎద్దేవా చేశారు. 3 ట్రిలియన్ ఎకానమీ అంటూ మూడు రూపాయల మైండ్‌సెట్‌తో సాధ్యమా అని, 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తూనే ఇంగ్లిష్ వద్దంటున్నారని నవ్వాలా ఏడవాలా అని ప్రశ్నించారు. రేవంత్ హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు రావేజింగ్ అని, గ్లోబల్ సమ్మిట్‌లో ధరించిన బట్టలు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ప్రశ్నించారు. చిరంజీవి కంటే నయం బట్టలు వేసుకొచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై విషం చల్లే మాటలు మానేస్తే రేవంత్‌కే మంచిదని సూచించారు.






