- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. టీజీపీఎస్‌సీ అభ్యర్థులపై దాసోజు శ్రవణ్ ట్వీట్
రిజర్వేషన్ల నిబంధనలపై సుప్రీంకోర్టు కీలకమైన, చారిత్రాత్మక తీర్పు వెలువరించిన నేపథ్యంలో చర్చానీయాంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రిజర్వేషన్ల నిబంధనలపై సుప్రీంకోర్టు కీలకమైన, చారిత్రాత్మక తీర్పు వెలువరించిన నేపథ్యంలో చర్చానీయాంశంగా మారింది. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు ఓపెన్ కటాఫ్ మార్కులకంటే ఎక్కువ సాధిస్తే, వారికి ఓపెన్ కేటగిరీ పోస్టులు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన GO 29 రాజ్యాంగానికి మోసమని, ఈ జీవో ద్వారా గ్రూప్-1 పరీక్ష రాసిన అణగారిన వర్గాల యువత రాజ్యాంగ ఆశలను ప్రభుత్వం చంపిందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
GO 29ను రద్దు చేసి..
నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం, టీజీపీఎస్‌సీ పెడచెవిన పెడుతోందని ఆరోపించిన ఆయన, సుప్రీంకోర్టు తీర్పుతో ఇక చట్టాన్ని విస్మరించే అవకాశం లేదన్నారు. GO 29ను రద్దు చేసి, GO 55ను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. నియంతృత్వానికి తెరదించాల్సిన సమయం ఆసన్నమైందని, టీజీపీఎస్‌సీ అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ట్వీట్ ఇదే..






