- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటమి భయంతో ఉప ఎన్నికలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోంది : దాసోజు శ్రవణ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను సర్వనాశనం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను సర్వనాశనం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ (Dasoju Shravan) ఆరోపించారు. శనివారం పార్టీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నేతలతో కుమ్మక్కై మా పార్టీ కార్యకర్తలపై అరాచకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ నిర్బంధాలు, బెదిరింపులు, దాడులు కొనసాగడంతో ఎన్నికల ప్రచారానికి అడ్డంకులు జరుగుతున్నయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం పేరుతో యర్రగడ్డ డివిజన్‌లో భారీగా కేకులు కట్ చేయడం, విందులు, చీరలు పంచడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు, ఉన్నత పోలీసు అధికారులు దీనిపై మౌనం వహించడం ప్రజాస్వామ్యానికి అవమానకరమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో జరుగుతున్న అక్రమాలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర జరుగుతోందని, పోలీసుల మౌనం, ఎన్నికల సంఘం నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్ష లాభం చేకూరుస్తోందని మండిపడ్డారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం స్వేచ్ఛా, నిష్పాక్షిక ఎన్నికలు జరగడం ఎన్నికల కమిషన్ బాధ్యత అని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.






