- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dasoju Shravan : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్
తెలంగాణ(Telangana)లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLA Quota MLC Elections)కు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(MLA Quota MLC Elections)కు రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండగా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం బీఆర్ఎస్(BRS) పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఈ స్థానానికి అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కుమార్ (Dasoju Shravan Kumar) ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS Cheif KCR). గులాబీ పార్టీ నుండి సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్ పేర్లు ముందునుంచి వినిపిస్తుండగా.. అంచనాల ప్రకారమే శ్రవణ్ పేరును ప్రకటించారు. ఈ మేరకు రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా.. వాటిలో ఒక స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఏఐసీసీ అధిష్టానం ఖరారు చేసింది.






