KTR: దానం, కడియంకు స్పీకర్ క్లీన్‍చిట్‍పై కేటీఆర్ రియాక్షన్.. వాట్ నెక్స్ట్?

by Prasad Jukanti |   (  Updated:2026-03-11 06:23:35  IST  )

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ మండిపడ్డారు.

KTR: దానం, కడియంకు స్పీకర్ క్లీన్‍చిట్‍పై కేటీఆర్ రియాక్షన్.. వాట్ నెక్స్ట్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (Danam Nagender), కడియం శ్రీహరికి (Kadiyam Srihari) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) క్లీన్‍చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఇది ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అన్నారు. ఈ మేరకు ఇవాళ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్‍చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం అని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు. ఇది కేవలం ఒక తీర్పు కాదని, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.

వాట్ నెక్స్ట్?:

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన వారిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, బి.కృష్ణమోహన్‌ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్‌, ఎం.సంజయ్‌ కుమార్‌, జి.మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ పార్టీ మారారనే ఆరోపణలు ఉన్నాయి. వీరిపై స్పీకర్ కు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఈ అంశం సుప్రీంకోర్టు వరుక చేరింది. సుప్రీంకోర్టు జోక్యంతో విచారణను వేగవంతం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ గతంలో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వగా విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్ లో ఉన్న దానం నాగేందర్, కడియం శ్రీహరి పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువరించారు. వీరికి క్లీన్ చిట్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీ-ఫామ్‍పై పోటీ చేసిన దానం నాగేందర్‍పై చర్యలు ఖాయం అని బీఆర్ఎస్ బలంగా విశ్వసించింది. ఈ మేరకు ఉప ఎన్నికలు వస్తాయని అందులో సత్తా చాటుతామని కేటీఆర్ గులాబీ శ్రేణులను పలు సందర్బాల్లో ఉత్సాహం కూడా నింపే ప్రయత్నం చేశారు. కానీ స్పీకర్ మాత్రం దానంతో పాటు ఆరోపణలు వచ్చిన 10 మంది పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ ఏం చేయబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

సుప్పీం ఏం చెప్పబోతోంది?:

దానంపై పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పందిస్తూ పార్టీ మారిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. ఇదే అంశంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నిర్ణయం పట్ల సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది? ఫిరాయింపుల కేసు చివరాఖరుకు ఎటువైపు వెళ్తుందో అనేది వేచి చూడాలి.

BIG BREAKING: కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు బిగ్ రిలీఫ్

Next Story