- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి అని.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్నిరకాలుగా అనుకూల వాతావరణం ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

- మంత్రి ఉత్తమ్‌తో డెన్మార్క్ రాయబారి భేటీ
- వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలపై చర్చ
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి అని.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్నిరకాలుగా అనుకూల వాతావరణం ఉంటుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ మంత్రి ఉత్తమ్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్య, పారిశ్రామిక రంగంలో రెండు దేశాల మధ్య మరింత బలపడాలని మంత్రి ఆకాంక్షించారు. గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర విశిష్టతను మంత్రి ఆయనకు వివరించారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో ఇక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధునిక వసతులు, ఫార్మా రంగంలో పురోగతిని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తరలివస్తున్నారని.. డెన్మార్క్‌లాంటి దేశం కూడా ముందుకు రావాలని కోరారు.






