Dangerous stunts: అర్ధరాత్రి ఫ్లైఓవర్‌పై ఇవేం పనులు! రెచ్చిపోతున్న పోకిరీలు..

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో చీకటి పడిందంటే కొందరు యువకులు ప్రమాదక బైక్ విన్యాసాలు చేస్తూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు.

Dangerous stunts: అర్ధరాత్రి ఫ్లైఓవర్‌పై ఇవేం పనులు! రెచ్చిపోతున్న పోకిరీలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Bike Stunts) హైదరాబాద్ నగరంలో చీకటి పడిందంటే కొందరు యువకులు ప్రమాదక బైక్ విన్యాసాలు (Dangerous stunts) చేస్తూ ఇతర వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో బైక్‌లపై స్టంట్స్ చేస్తూ దొరికిన ఆకతాయిలపై పోలీసులు చర్యలు తీసుకున్నా.. పోకిరీలు మాత్రం రోడ్డుపై రెచ్చిపోతు ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్ పరిధిలోని ఆరాంఘర్ (Aramghar) ఫ్లైఓవర్‌పై రాత్రి సమయంలో కొంతమంది యువకులు స్కూటీలపై ప్రమాదకరంగా స్కూటీలపై స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులును ఇబ్బందులకు గురిచేశారు. ఓవైపు ప్రమాదకర విన్యాసాలు చేయడమే కాకుండా.. రీల్స్ వీడియోలు తీసుకుంటూ వారు రెచ్చిపోయారు. ఒక్కరు కూడా హెల్మెట్ ధరించకుండా.. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా.. నిర్లక్ష్యంగా స్కూటీలను నడుపుతూ ఆ పోకిరీలు కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో తాాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్ధరాత్రి ఫ్లైఓవర్‌పై ఇవేం పనులని వారిపై నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్‌లు హైదరాబాద్ పోలీసులకు రిక్వెస్ట్ చేశారు.

Next Story