వర్షాలతో పొంచివున్న ముప్పు.. కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!

by Disha Web Desk 6 |
వర్షాలతో పొంచివున్న ముప్పు.. కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు గురువారం నుంచి మొదలై ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అకాల వర్షాలు ముందుగానే స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలతో ఆస్పత్రి పాలవుతున్నారు.

కాబట్టి ఈ వర్షాల్లో వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీరును వేడి చేసి చల్లార్చిన తర్వాత తాగాలి. అలాగే వేడి ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవని డాక్టర్లు అంటున్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగులు, రైన్ కోట్స్, మాస్కులు ధరిస్తే పలు హానికర సమస్యల నుండి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మూడు రోజులు ఈ జాగ్రత్తలు పాటించడం మంచిదని చెబుతున్నారు.


Next Story