- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rajireddy: రైతులు ఆదాయం వచ్చే పంటలు సాగు వేయాలి
by Gantepaka Srikanth |
కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యాన ప్రణాళికను గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్స్లర్డాక్టర్ దండ రాజిరెడ్డి అందజేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ఉద్యాన ప్రణాళికను గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్స్లర్డాక్టర్ దండ రాజిరెడ్డి అందజేశారు. శనివారం గవర్నర్ కార్యాలయంలో కలిసి ఇటీవల నిర్వహించిన నాలుగవ వర్సిటీ స్నాతకోత్సవం ఆల్బమ్‌ను బహుకరించారు. రాష్ట్ర ఉద్యాన ప్రణాళికలో రాష్ట్ర వినియోగదారుల అవసరాలు, రైతుల ఆదాయాలు పెంచే విధంగా సాంకేతికతతో కూడిన మేలిమి విషయాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా సాగుతున్న కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ, ఔషద ధ్రవ్యాల అవసరాలు, పంటల సాగు విస్తరణ, రైతుల ఆదాయాలపై ప్రధానంగా ఈ ప్రణాళిక ఉందని తెలిపారు.
Next Story






