- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామాలు.. శ్రీధర్ బాబుతో దానం భేటీ
నిన్న ఏఐసీసీ పెద్దలతో భేటీ అయిన దానం నాగేందర్ ఇవాల శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ కావడం ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది విచారణ పూర్తి కాగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ వ్యవహారం ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఇవాళ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో నిన్న ఏఐసీసీ పెద్దలు, న్యాయ నిపుణులతో సమావేశమైన దానం ఇవాళ శ్రీధర్ బాబుతో సమావేశం కావడంతో దానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే తిరిగి తనకే టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను దానం కోరినట్లు తెలుస్తోంది. ఆ విషయాలనే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో దానం ఇవాళ చర్చించినట్లు తెలుస్తోంది.
కడియం బాటలో దానం:
పార్టీ ఫిరాయింపుల విషయంలో ఈ నెల 23వ తేదీలోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ గడువు రేపటితో ముగియనుంది. అయితే తనకు మరింత గడువు ఇవ్వాలని కడియం శ్రీహరి గడువు కోరిన నేపథ్యంలో దానం నాగేందర్ సైతం అదే బాటలో గడువు కోరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ ఫిరాయింపుల విచారణ ఎదుర్కోవడం కంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లడమే బెటర్ అనే అభిప్రాయాన్ని దానం తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానం తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది వేచి చూడాలి.
READ MORE ....
ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలను మరిచిపోవద్దు: మంత్రి శ్రీధర్ బాబు






